
భద్రత లేదు.. భరోసా కరువు!
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లూ వదలడం లేదు
నిఘా పెంచుతాం
ఆలేరు: జనవరిలో ఆలేరులోని బీసీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు తస్కరించారు.
● ఫిబ్రవరిలో శారాజీపేటలో ఇంటి తాళం పగులకొట్టి మూడు తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు.
● ఏప్రిల్ 25న ఆలేరులోని నగల షాపులో చోరీ జరిగింది. కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారు వస్తువులు అపహరించుకెళ్లారు. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన దొంగల ముఠా బైక్‌లపై వచ్చి చోరీకి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నాలుగు నెలలు కావొస్తున్నా కేసు
పురోగతి లేదు.
● జూన్‌లో ఆలేరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి 7.5 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదు గుర్తు తెలియని ఎత్తుకెళ్లారు.
ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చోరీల నియంత్రణ, వివిధ కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని, దీంతో సొమ్ము రికవరీలో జాప్యం ఏర్పడి బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదన్న విమర్శలున్నాయి.
దర్యాప్తులో జాప్యం
ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి కేసులు నమోదు చేస్తున్నా.. దర్యాప్తులో జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో రాచకొండ పోలీసులకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా ఆలేరు పరిధిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంతో సొమ్ము రికవరీ కాక బాధితులు నష్టపోతున్నారు.
గస్తీకి సుస్తీ..?
ఆలేరు పట్టణం మీదుగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి, రైలుమార్గం ఉంది. ఆలేరులో పలు రైళ్లకు హాల్టింగ్ ఉంది. రాత్రి వేళ గస్తీ సక్రమంగా లేకపోవడం వల్ల చోరీలకు పాల్పడిన దుండగులు బైపాస్ నుంచి, రైళ్ల ద్వారా సులువుగా పారిపోతున్నట్టు వాదనలున్నాయి. అదే విధంగా ఠాణాకు సమీపంలోనే పలు కేసుల్లో సెటిల్‌మెంట్ వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
దొంగతనాలు 17
సైబర్ నేరాలు 05
చీటింగ్ కేసులు 02
హత్యాయత్నాలు 02
ఘర్షణలు 15
భూవివాదాలు 06
రియల్ ఎస్టేట్ 08
మిస్సింగ్ 14
గుట్కా 03
బెల్టుషాపులు 12
ఆత్మహత్య 06
హత్యలు 01
కల్తీ ఆహారం 03
జనవరి నుంచి ఆగస్టు వరకు
నమోదైన కేసులు
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం వదలడం లేదు. వ్యవసాయ బోరు మోటార్లు, పంపు సెట్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌కో శాఖ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, లక్షల రూపాయలు విలువ చేసే రాగి తీగ ఎత్తుకెళ్తున్నారు. ఆలేరు విద్యుత్ డివిజన్ పరిధిలో గొలనుకొండ, ఆలేరు, కొలనుపాక, మందన్‌పల్లి, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట, మోటకొండూర్, రాజాపేట గ్రామాల పరిధిలో పొలాల వద్ద నుంచి 16, 25 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు 20 వరకు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుంది. పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.
మిస్టరీగా దొంగతనం కేసులు
ఫ నెలలు గడిచినా దర్యాప్తులో కనిపించని పురోగతి
ఫ బాధితులకు జరగని న్యాయం
ఫ ఆలేరు స్టేషన్ పరిధిలో
జనవరి నుంచి 70 ఘటనలు
దొంగతనాల నియంత్రణకు నిఘా పెంచుతాం. ముఖ్యంగా బైపాస్ మార్గంలో పెట్రోలింగ్‌ను మరింత పకడ్బందీగా చేస్తాం. చోరీలతోపాటు వివిధ కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. నేర పరిఽశోధనలో కీలకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు, వ్యాపారులకు సూచిస్తున్నాం.
–వినయ్, ఎస్‌ఐ ఆలేరు