
భూ సమస్యలపైనే అధికం..
భువనగిరిటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 45 మంది అర్జీలు అందజేశారు. అందులో భూ సమస్యలకు సంబంధించినవి 30 అర్జీలు ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
● బీబీనగర్‌లోని ఐదెకరాల గ్రామకంఠం భూమిని పంచాయతీ వారు స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్‌కు విన్నవించారు.
● ఆత్మకూర్(ఎం) మండలం పారుపల్లిలోని జమ్మికుంటను కొందరు అక్రమించారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. కుంట ఆక్రమణకు ముందు నీరు నిల్వ ఉండడం వల్ల పశువులు, గొర్రెలకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. కుంటను కాపాడాలని మల్లేష్, నర్సయ్య, యాదగిరి, భిక్షపతి, సత్తిరెడ్డి కోరారు.
● కుక్కల దాడిలో 72 గొర్రెలు మృతి చెంది సుమారు రూ.8లక్షల నష్టపోయానని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన సంపత్ వినతిపత్రం అందజేశాడు. ఆయన వెంట జల్లి నర్సంహులు, బైల సాయిమల్లయ్య, ఎగ్గడి శ్రీశైలం, జూకంటి సాయిమల్లయ్య, కావడి బక్కయ్య, వెంకటయ్య, బాల్‌నర్సయ్య ఉన్నారు.
ఫ ప్రజావాణికి 45 అర్జీలు
ఫ సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్