సీఎం చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
నడిగూడెం: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రాం సంక్షేమ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
నారమ్మగూడెం వాసికి ప్రోత్సాహక బహుమతి
నిడమనూరు: అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన ఎక్కలూరి నక్షత్రారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి అందుకుంది. డిండి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నక్షత్రారెడ్డి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకం, సీఎం కప్‌లో 400 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానం, సూర్యాపేటలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రథమ స్థానం సాధించింది. నక్షత్రారెడ్డిని నారమ్మగూడెం మాజీ సర్పంచ్ దుబ్బాకుల రాంరెడ్డి, స్థానిక నాయకులు తులసీరెడ్డి, గోవింద్‌రెడ్డి, కొండా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అభినందించారు.


