
చేనేత వారసత్వాన్ని చాటి చెప్పాలి
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు పోచంపల్లిని సందర్శించి తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆమె భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్కులో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియం, ఆడిటోరియం, హాంప్లి థియేటర్‌ను సందర్శించారు. అనంతరం టూరిజం, హ్యాండ్లూమ్ అధికారులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో సమావేశమయ్యారు. పోచంపల్లి ఇక్కత్‌తో పాటు గొల్లభామ, గద్వాల, నారాయణపేట తదితర హ్యాండ్లూమ్ వస్త్రాలతో గదులను డెకరేట్ చేయాలని సూచించారు. అదేవిధంగా టూరిజం ప్రాంగణంలో స్థానిక చేనేత కళాకారులచే మగ్గాలు, తదితర స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
టూరిజం అభివృద్ధికి విదేశీయుల
పర్యటన దోహదం
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 40 దేశాలకు చెందిన అందాల భామలు మే 15న పోచంపల్లికి వస్తున్నారని స్మితా సబర్వాల్ తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల్లో 140 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారని, వారిని బృందాలుగా విభజించి తెలంగాణ సంప్రదాయాలను పరిచయం చేయడానికి ప్రముఖ ప్రదేశాలు, దేవాలయాలను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఎండలు బాగా ఉన్నందున విదేశీయులకు ఇబ్బందులు కలగకుండా పోచంపల్లిలో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8గంటల లోపు కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశామని చెప్పారు. చేనేత పరిశ్రమతో పాటు టూరిజం అభివృద్ధికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. హ్యాండ్లూమ్ థీమ్‌ను అంతర్జాతీయ ఆడియన్స్, ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నామని ఇందుకు పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ స్వయం మగ్గం నేశారు. అదేవిధంగా మగ్గం నేసే వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్, టూరిజం శాఖ ఈడీ విజయ్, సీఈ శ్రీనివాస్, డీఈఈ హనుమంతరావు, ఏఈ రాంప్రసాద్, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, స్థానిక టూరిజం మేనేజర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ
కార్యదర్శి స్మితా సబర్వాల్

చేనేత వారసత్వాన్ని చాటి చెప్పాలి