
గంజాయి రహిత జిల్లాగా మార్చుదాం
సాక్షి,యాదాద్రి : గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్, ఎకై ్సజ్, డ్రగ్స్, వైద్య, విద్య, అటవీ, ఆర్టీసీ, సంబంధిత శాఖలు సమన్వయంతో గంజా యి రవాణాను అరికట్టాలని కోరారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూ చించారు. కళాకారుల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని, విద్యాసంస్థలున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. డీసీపీ అక్షాంశ్‌యాదవ్ మాట్లడుతూ డ్రగ్స్‌ను అరికట్టే విషయంలో పోలీసు శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనా రాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు