సాక్షి యాదాద్రి : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని సమాచారం. రెండు నెలలుగా యాదాద్రిభువనగరి జిల్లాలో 15కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. వలిగొండ మండలం సంగెంకు చెందిన ఇద్దరు యువకులు ఈ వరుస దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన వీరు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. డీసీసీ రాజేష్ చంద్ర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు సమాచారం.