కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బదిలీ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బదిలీ

Oct 12 2023 4:30 AM | Updated on Oct 12 2023 9:28 AM

- - Sakshi

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

యాదాద్రి: జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్‌ కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లాకు కూడా కలెక్టర్‌ పని చేశారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించి సమీక్ష సమావేశాలు నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, డబ్బులు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేయడం, పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకపోవడం, కొందరు అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడం వంటి విషయాలను ఎత్తి చూపింది.

దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారులపై ఫిర్యాదులు రావడాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కలిగించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వినయ్‌ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా రెండు నెలలకు పైగా పని చేశారు. ఆయన స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల లోగా నూతన కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement