కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతి

May 23 2023 1:38 AM | Updated on May 23 2023 1:43 PM

- - Sakshi

నల్గొండ: కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతిచెందిన ఘటన మండలంలోని బొజ్జగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొజ్జగూడెం గ్రామానికి చెందిన భూక్యా కోట్యా కుమార్తె వివాహం సోమవారం జరిగింది.

వివాహం అనంతరం నూతన వధూవరులు కారులో వెళ్తుండగా వారితో పాటు కారు వెనుక సీటులో బానోతు వెంకటేశ్వర్లు కుమార్తె ఇంద్రజ(9) కూర్చుంది. ఈ క్రమంలో ఇంద్రజ కారు డోరులోంచి తల బయట పెట్టి డ్యాన్స్‌ చేస్తుండగా డ్రైవర్‌ శేఖర్‌ అద్దం పైకి లేపడంతో ఊపిరాడక చనిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement