వృద్ధురాలి హత్యకేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్యకేసు ఛేదన

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

నిందితుడి అరెస్ట్‌

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పోణంగి గ్రామంలో వృద్ధురాలి హత్య కేసును వన్‌టౌన్‌ సర్కిల్‌ పోలీసులు ఛేదించారు. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ కె.రామకృష్ణ, ఏలూరు రూరల్‌ ఎస్సై వి.వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం పాతమాలపల్లి జెండా సెంటర్‌కు చెందిన సిగిరెడ్డి మరియమ్మ అలియాస్‌ కుంటమ్మ (66) ఒంటరిగా నివసిస్తోంది. గత నెల 22న తలపై తీవ్ర గాయాలతో ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యగా నిర్ధారించారు. అయితే మరియమ్మ వద్ద డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన గూడపాటి అజయ్‌ గత నెల 21న అర్ధరాత్రి ఆమె ఇంటిలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించాడు. వృద్ధురాలు నిద్రలేచి కేకలు వేయడంతో, తనను గుర్తుపడుతుందనే భయంతో ఇంటిలోని సిమెంట్‌ ఇటుక రాయితో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు అజయ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement