ఎల్‌నినో సాకుతో ధరలు పెంచితే కేసులు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో సాకుతో ధరలు పెంచితే కేసులు

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

ఎల్‌నినో సాకుతో ధరలు పెంచితే కేసులు

నూజివీడు: ఎల్‌నినో సాకుతో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరంగా కఠిన కేసులు నమోదు చేస్తామని రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కే. నాగేశ్వరరావు హెచ్చరించారు. నూజివీడు పట్టణంలో నిత్యావసర వస్తువులను విక్రయించే పలు దుకాణాలను ఆయన బుధవారం అధికారుల బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బియ్యం సంచులపై గరిష్ట చిల్లర ధర వివరాలను స్టిక్కర్లతో అతికించడం, ప్యాకింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, ఉండవలసిన బరువు కంటే తక్కువ తూగడం, అలాగే బియ్యం సంచులపై తయారీదారుడు లేదా ప్యాకర్‌ చిరునామా వివరాలు ముద్రించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు శ్రీ లలిత దత్త మార్ట్‌పై ఒక కేసు, శ్రీ రామ ట్రేడర్స్‌పై నాలుగు కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏఓ జీ మీరయ్య, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ డి.ప్రసాద్‌ కుమార్‌, ఏజీపీ శ్రీధర్‌, తూనికలు కొలతల శాఖ అధికారి జీ వెంకట ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement