ఏలూరులో అర్ధరాత్రి ఘాతుకం | - | Sakshi
Sakshi News home page

ఏలూరులో అర్ధరాత్రి ఘాతుకం

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

● పాతకక్షలతో ఇంటిపై దాడి

● పెట్రోల్‌ బాటిళ్లతో ఇంటికి నిప్పు

● స్థానికుల సహకారంతో మంటలు అదుపు

● త్రుటిలో తప్పిన ప్రమాదం

ఏలూరు టౌన్‌ : పాతకక్షల నేపథ్యంలో దుండగులు అర్ధరాత్రి వేళ ఓ ఇంటిని దహనం చేసేందుకు ఇంటిపై పెట్రోల్‌ బాటిళ్లతో దాడి చేశారు. స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో త్రుటిలో పెను ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది. ఏలూరు నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలోని తంగెళ్ళమూడి కబాడీకాలనీకి చెందిన మేరుకు ధనలక్ష్మి (45) తన ఇంటివద్దే చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే కాలనీకి చెందిన కాశీ సత్యనారాయణ, లంకపేటకు చెందిన దేవా, కాశీ శ్యామ్‌, పెదపూడి నాని, గెడ్డం వెంకటేష్‌ అనే వ్యక్తులతో ధనలక్ష్మి కుటుంబానికి గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కాశీ సత్యనారాయణ.. ధనలక్ష్మి పెద్ద కుమారుడు సాయితేజకు ఫోన్‌ చేసి చంపేస్తానని తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఆ కక్షలతోనే ఈనెల 11న రాత్రి 11:30 గంటల సమయంలో ధనలక్ష్మి కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలో ఉండగా దుండగులు ఇంటిలోకి పెట్రోల్‌ బాటిళ్లు విసిరారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి కిరాణా కొట్టులోని రిఫ్రిజిరేటర్‌తోపాటు పలు వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తన కుమారుడిని బెదిరించిన కాశీ సత్యనారాయణ, దేవా, శ్యామ్‌, నాని, వెంకటేష్‌ తదితరులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో నిందితుల కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement