అతివేగంతో నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగంతో నిండు ప్రాణం బలి

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

అతివేగంతో నిండు ప్రాణం బలి

● ఢీకొన్న రెండు లారీలు

● ఓ లారీ డ్రైవర్‌ మృతి

దెందులూరు : స్థానిక దెందులూరు శివారులోని గుండేరు వాగు సమీపంలో 16వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న పుల్లల లారీని, అదే దిశలో వెనుక నుంచి వచ్చిన మరో పుల్లల లారీ అతివేగం, నిర్లక్ష్యంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరపడి గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దెందులూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement