క్షీరారామంలో కార్తీకమాస ఏర్పాట్లపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షీరారామంలో కార్తీకమాస ఏర్పాట్లపై నిర్లక్ష్యం

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు పంచారామక్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాలకు వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో, సాధారణంగా ఉత్సవాలకు ముందే జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించి, భక్తులకు కల్పిస్తున్న వసతులపై విలేకరులకు వివరాలు వెల్లడిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఎన్నికల బిజీ కారణంగా కలెక్టర్‌, ఆర్డీవోలు ముందస్తు పర్యవేక్షణకు రాలేకపోగా, దేవదాయ శాఖ అధికారులు కూడా కార్తీకమాసం ప్రారంభమైన తర్వాతే రావడం గమనార్హం. మంగళవారం దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ వేండ్ర త్రినాథరావు ఆలయాన్ని సందర్శించి, క్యూలైన్లు, కార్తీకమాస అన్నదాన కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే నిత్యాన్నదానం దేవస్థానం నిర్వహిస్తోందా లేక దాతల సహకారంతో నడుస్తోందా అనే వివరాలపై స్పష్టత కరవైంది. ఉన్నతాధికారులు సంతృప్తి చెందడమే కాకుండా, ఈ నెల రోజుల పాటు భక్తులు కూడా ఎంతవరకు సంతృప్తి చెందుతారో వేచి చూడాల్సిందే. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిల్లా ఏసీ వి. వెంకటేశ్వరరావు, వివిధ ఆలయాల ఈవోలు వేణు, అరుణ్‌కుమార్‌, శంకరం, ఆర్‌. రంగరాజన్‌, అరసవల్లి శ్రీనివాసు, ఎ. శ్రీనివాసు, పెదగోపురం ఈవో రాపాక శ్రీనివాసరావు, చైర్మన్‌ మీసాల రామచంద్రరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement