భీమవరం (ప్రకాశం చౌక్): పట్టణంలో విజిలెన్సు, పౌర సరఫరా, తూనికలు, కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బియ్యం అధిక ధరలకు విక్రయించడం, సంచులపై ముద్రించిన ఎమ్మార్పీ ధరలను అక్రమంగా మార్చడం, తయారీదారు లేదా ప్యాకర్ వివరాల చిరునామా ముద్రించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు దుకాణాలపై తూనికలు, కొలతల చట్టం ప్రకారం మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్‌పై 2 కేసులు, శ్రీ మహాలక్ష్మి రైస్ అండ్ జనరల్ స్టోర్స్‌పై 2 కేసులు, లక్ష్మీ వెంకట గాయత్రీ ట్రేడర్స్‌పై 2 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, కూరగాయలను ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, జి. మీరయ్య, తూనికలు కొలతల అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సీఆర్ రెడ్డి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎండీ కరీముల్లాకు అరుదైన గౌరవం లభించింది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ హాకీ జట్టు సెలెక్టర్‌గా యూనివర్సిటీ అధికారులు ఆయనను ఆహ్వానించారు. దీంతో పాటు, యూనివర్సిటీ పరిధిలో జరిగే అంతర్ కళాశాలల హాకీ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. తమ కళాశాలకు పేరు తెచ్చిన కరీముల్లాను కళాశాల కరస్పాండెంట్ కేఎస్ విష్ణుమోహన్, ప్రిన్సిపాల్ రత్నాకర్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.


