గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

పండుగ పూట విషాదం గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు

పండుగ పూట విషాదం
దీపావళి పండుగ రోజున ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 8లో u

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు

భీమవరం: కూటమి పార్టీ నాయకులు అధికార బలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టి నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజలు స్పష్టంగా కనబర్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయమే లక్ష్యంగా పనిచేశారన్నారు. జిల్లాలోని నరసాపురం, ఆకివీడు మున్సిపల్‌ ఎన్నికలతోపాటు 20 జెడ్పీటీసీ, 336 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి నాయకులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దీటుగా పోటీ ఇచ్చారన్నారు. కూటమి నాయకుల బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి 36 ఎంపీటీసీలు, 9 కౌన్సిలర్‌ స్థానాలను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఓటుతో వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రావడానికి ఇప్పటి ఎన్నికలు శుభసూచకమన్నారు. ఈ సమావేశంలో పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement