భీమవరం: మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని భీమవరం సివిల్ జడ్జి ఎం.సుధారాణి అన్నారు. మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో భీమవరం సీత పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ మహిళలు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటామని సంకల్పం చేయాలని, మహిళలకు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక చట్టాలు రక్షణగా ఉన్నాయన్నారు. పెండింగ్ కేసులను రాజీ చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన న్యాయవాదులను మధ్యవర్తులుగా ని యమించారన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రామకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: మండలంలోని దువ్వ గ్రామంలో వయ్యేరు ముంపు ప్రాంతంలో శుక్రవారం డీఎంహెచ్‌ఓ ఎం.రవిబాబు పర్యటించారు. ముంపు బాధితుల ఆరోగ్య సమాచారిన్న అడి గి తెలుసుకున్నారు. నివాసితులంతా ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని, మురుగునీటి సమీపంలో నివసిస్తున్న వారంతా కాచి చల్లార్చిన నీటిని తాగడం, వేడిగా ఉన్న ఆహారం భుజించాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటుచేశామని, ఆరు వైద్య బృందాలతో ముంపు ప్రాంతంలో ఇంటింటా సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా దోమకాటుకు గురవకుండా దోమ తెరలు వినియోగించాలని చెప్పారు. వైద్యాధికారి సాయి గిరిధర్‌రెడ్డి, డాక్టర్ సాయి భవాని, వైద్య సిబ్బంది ఉన్నారు.
భీమవరం: స్థానిక కాస్మో పాలిటన్ క్లబ్‌లో జాతీయస్థాయి టెన్నిస్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ రామభద్రిరాజు, బీహెచ్ సుబ్బరాజు, టోర్నమెంట్ చైర్మన్ యు.కృష్ణ ప్రసాద్, వైస్ చైర్మన్ టి.కృష్ణబాబు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సింగిల్స్ పురుషుల విభాగంలో డి.శ్రీకర్, జి.నాశిక్‌రెడ్డి, మయాంద్ తివారి, పి.శాండిల్య, మ హిళల విభాగంలో దండు లక్ష్మి సిరి, ఎం.ప్రశాంతి ముండే, డి.నిర్మల్ ఫెర్నాండో, హర్షిణి నాగరాజ్ విజేతలుగా నిలిచారు. మహిళల డబుల్స్ విభాగంలో జోయల్ నికోల్–అర్జాన్ ఖోరాకివాలా సత్తాచాటారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): హైదరాబాద్‌లో జరిగే 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అండర్–18 రాష్ట్ర క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 10న నిర్వహించనున్నామని శాప్ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌సీహెచ్‌ఆర్‌ఎం హై స్కూల్ ఆవరణలో బాలబాలికలకు మల్లఖంబ్ సెలెక్షన్స్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సెలెక్షన్స్ ప్రారంభమవుతాయని, 01.01.2009 తేదీ తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 99082 67811లో సంప్రదించాలని ఆయన కోరారు.
వీరవాసరం: అర్నబ్ తుపాను కారణంగా వా యిదా పడిన స్కూల్‌గేమ్స్ అండర్–14, 17 బాలబాలికల రైఫిల్ షూటింగ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 8న భీమవరంలోని చింతలపాటి బాపిరాజు ము న్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శులు గు త్తుల నర్మద, మహమ్మద్ ఖుద్ధుస్ ప్రకటన వి డుదల చేశారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.


