వరద బాధితులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులను ఆదుకోవాలి

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

తాడేపల్లిగూడెం రూరల్‌: వరద ముంపు గ్రామాల్లోని వరద బాధితులకు ముందుగా పునరావాసం కల్పించాలని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎర్రకాలువ ప్రభావిత ప్రాంతాలైన మండలంలోని మారంపల్లి, నందమూరు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి, వరద బాధితులకు పాలు, అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎర్రకాలువ ఉధృతికి రాత్రికి రాత్రే నందమూరు, మారంపల్లి గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, ఇళ్లల్లోకి వరద నీరు చేరిందన్నారు. వరద బాధితులకు అవసరమైన తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసర స రుకులను అందించాలన్నారు. వరద తగ్గిన తర్వాత అవసరమైన మందులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వరద వల్ల గృహోపకరణాలు, ఇతర ఆస్తులు నష్టపోయిన బాధిత కు టుంబాలను ప్రభుత్వం గుర్తించి పరిహారం అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు గ్రామాల వరద బాధితులకు అండగా నిలుస్తూ వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు గొర్రెల శ్రీనివాస వట్టి బుజ్జి, కొవ్వూరి ప్రేమ్‌ కిరణ్‌రెడ్డి, లంకా రాజశేఖర్‌, కోనేటి దానయ్య, మాకరాజు సతీష్‌ తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ రఘురాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement