భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

భీమవరం: భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని 52 వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి వారి గెలుపు కోసం నిరంతరం పాటుపడాలన్నారు. పట్టణవాసులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అభివృద్ధి లేకపోగా కనీసం సౌకర్యాలు కూడా కొరవడటంతో ప్రజలంతా విసిగిపోయారన్నారు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అధికారంలోనికి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామంటూ ప్రజలకు వి వరించాలని సూచించారు. పార్టీ నరసాపురం పార్ల మెంట్‌ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ టౌన్‌ ప్రెసిడెంట్‌ గాదిరాజు రామరాజు, రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ కోడే యుగంధర్‌, స్టేట్‌ లీగల్‌ సెల్‌ సెక్రటరీ బడుగు అశోక్‌, నాయకులు కరీముల్లా బాషా, గోపిశెట్టి సుబ్బారావు, మల్లుల శ్రీనివాస్‌, సాల శ్రీను, గంటా రాహుల్‌, పెచ్చేటి ప్రసాద్‌, కనుమూరి విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement