ఉద్యాన పంటల రక్షణకు కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటల రక్షణకు కార్యాచరణ

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

ఉద్యాన పంటల రక్షణకు కార్యాచరణ

తాడేపల్లిగూడెం (టీఓసీ): తుపాను ప్రభావిత ఉద్యాన పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ శుక్రవారం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ డాక్టర్‌ కట్టుపల్లి ధనుంజయరావు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రెండు తుపాన్లు కారణంగా వివిధ రకాల ఉద్యాన పంటలకు వాటిల్లుతున్న నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రత్యేక కార్యచరణను చేపట్టామన్నారు. జిల్లాలోనితోటలను, ఉద్యాన పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి, రైతులకు ధైర్యం చెబుతూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యాన పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూ డిన ప్రత్యేక అవగాహన కరపత్రాలను విడుదల చే స్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రార్‌ ఎం.మాధవి, పరిశోధన సంచాలకుడు ఎస్‌.సూర్యకుమారి, విస్తరణ సంచాలకుడు డీవీ స్వామి, ఈ.కరుణశ్రీ, దొరాజీ, పరాత్పరావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement