అత్తిలి: దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2వ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం అత్తిలిలో అసోసియేషన్ కార్యదర్శి యడ్లపల్లి సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘాల రిజిస్ట్రేషన్, క్రీడాకారుల వివరాల అప్‌డేట్, గత ఏడాది క్రీడా కార్యక్రమాల సమీక్ష, రాబోయే వార్షిక క్రీడా క్యాలెండర్ రూపకల్పన, సౌత్ జోన్ టోర్నమెంట్ల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే అండర్–19 క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలికా క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 2026–27 సంవత్సరానికి వివిధ కమిటీలు బాధ్యతలను నియమించారు. గేమ్ డెవలప్‌మెంట్ ఆపరేషనన్స్ డైరెక్టర్‌గా సుగాలి మధుసూదన్‌నాయక్, టోర్నమెంట్ ప్రోగ్రామింగ్, సీఎస్‌ఆర్ యాక్టివిటీస్ డైరెక్టర్‌గా గాధంశెట్టి తేజ, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జి.కై లాష్, లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్‌గా కన్నూరి సురేష్, అంపైరింగ్ కమిటీ చైర్మన్‌గా రాజపుట్ నాగేంద్రసింగ్, స్కోరర్ కమిటీ చైర్మన్‌గా దాసం దుర్గారావు ఎన్నికయ్యారు. జోనల్ కోఆర్డినేటర్లుగా సౌత్ జోన్‌కు రామాంజుల నాయక్, సెంట్రల్ జోన్‌కు సుబ్బయ్య, నార్త్ జోన్‌కు బి.రామృష్ణ, సలహాదారులుగా యడ్లపల్లి అయ్యప్పస్వామి, శరకణం పద్మారావు, మైపాల శ్రీనివాసు, అసోసియేషన్ మీడియా ఇన్‌చార్జిగా సిరిపురపు శ్రీహరి, అంబుడ్స్‌మన్ ఎథిక్స్ ఆఫీసర్‌గా అనుకుల రమేష్ తదితరులు ఎన్నికయ్యారు.


