పాలకోడేరు : మోగల్లులో గౌడ సంఘం నాయకులు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి మంతెన యోగీంద్ర కుమార్ (మంతెన బాబు) ఆధ్వర్యంలో గౌడ సంఘానికి చెందిన పెద్ది సిద్ధయ్య తదితరులు పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్సీపీలో చేరారు. వారికి మంతెన బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ.. కూటమి పార్టీల పాలన కంటే గత వైఎస్సార్సీపీ పాలనే మెరుగ్గా ఉందని భావించే తాము పార్టీలోకి చేరినట్లు తెలిపారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు జాలే సునీత, కామన బులిరాజు, దొడ్డా విసు, మాజీ ఉపసర్పంచ్ పెన్మత్స సీతారామరాజు, శ్రీను రాజు, మద్దుల మౌళి, జాలే సుమంత్, బలే చిట్టిబాబు, ఆకుల బుజ్జి, ఆకుల రంగా, దొడ్డా రంగారావు, కె. విజయ్ ప్రతాప్, చేబోలు సత్యనారాయణ, బేతాళ యేసు, బుంగా యోహాను, కోరుకొల్లు దాసు, గరికి దాసు, ఇర్రింకి వెంకన్న, కోణాల ప్రకాష్, రంజాల వెంకట్, యాడంగి వెంకటేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


