ప్రభుత్వ లాంఛనాలతో డా.బాబ్జీ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో డా.బాబ్జీ అంత్యక్రియలు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

పాలకొల్లు సెంట్రల్‌: వైద్యుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (డాక్టర్‌ బాబ్జీ) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర పట్టణ ప్రధాన రహదారి గుండా కొనసాగింది. పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్‌ బాబ్జీ మనవడు (కుమారుడి కుమారుడు) తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మార్కెట్‌కు సెలవు ప్రకటించగా, మరికొందరు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. పట్టణ పరిసర ప్రాంతాలు, జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు వేలాదిగా వచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రి నిమ్మలతో పాటు డాక్టర్‌ బాబ్జీ ఆసుపత్రిలో పనిచేసిన నర్సులు సైతం ఆయన పార్థివదేహాన్ని మోస్తూ శ్మశానవాటికకు చేరుకున్నారు. అంతిమయాత్రలో ఆయన పాడె మోసేందుకు జనం పోటీపడడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement