న్యూస్‌రీల్
కొందరి మెప్పు కోసం..
కూటమి ప్రలోభాలు
జిల్లాలో ఇలా..
పోలింగ్ శాతం
రేపు కౌంటింగ్
తుపాన్ల ప్రభావంతో పంటలు ముంపు బారిన పడగా.. చేపట్టాల్సిన యాజమాన్య మెలకువలను ఏరువాక కో–ఆర్డినేటర్ వివరించారు. IIలో u
శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: జిల్లా, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ముగిశాయి. 69.73 శాతం పోలింగ్‌తో 7,34,155 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటమి భయంతో కూటమి నేతలు ఎక్కడికక్కడ ప్రలోభాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో తమ అభ్యర్థుకు ఓటు వేయాలంటూ ప్రచారాలు సాగించారు. పోలింగ్ కేంద్రాన్ని తమ ప్రాంతం నుంచి మార్చడాన్ని నిరసిస్తూ భీమవరం రూరల్ కోమటితిప్ప ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 340 ఎంపీటీసీ స్థానాలకు గురువారం జిల్లావ్యాప్తంగా 1,244 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. భారీ వర్షాల నేపఽథ్యంలో నీటమునిగి ఓటర్లు వెళ్లడానికి వీలులేకుండా ఉన్న అత్తిలి, తణుకు, మొగల్తూరు, వీరవాసరం, పెనుమంట్ర తదితర మండలాల్లోని 43 పోలింగ్ స్టేషన్లను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చి పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో 10,52,927 మంది ఓటర్లకు గాను 7,34,155 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 3,65,443 మంది, మహిళలు 3,68,708 మంది, ఇతరులు 4 మంది ఉన్నారు.
8 వేల మంది సిబ్బంది
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతరం భీమవరంలో మీడి యాతో మాట్లాడుతూ పీఓలు, ఏపీఓలు, రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, ఆర్‌ఓలతో కలిపి మొత్తం 8,000 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. పోలీసు శాఖకు సంబంధించి 942 మంది సిబ్బందిని నియమించామన్నారు. వీరిలో 19 స్ట్రైకింగ్ ఫోర్సులు, 13 రాపిడ్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకోడేరులోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాల వద్ద భద్రత నుంచి, ఓటింగ్ ప్రక్రియ ముగిసి బ్యాలెట్ పెట్టెలు సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతల పరిశీలన
ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురాంనాయుడు, భీమవరంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు, ఉండిలో నియోజకవర్గ ఇన్‌చార్జి మంతెన యోగీంద్రబాబు పోలింగ్ సరళిని పరిశీలించారు.
భీమవరం రూరల్ వెంకటతిప్ప గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను కోమటితిప్పకు మార్చడాన్ని నిరసిస్తూ కోమటితిప్ప నార్త్ పంచాయతీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వారి వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పోలింగ్ కేంద్రం సమస్యను పరిష్కరించేంత వరకు పోలింగ్‌లో పాల్గొనేది వారు స్పష్టం చేశారు. కేవలం కొందరి మెప్పు కోసం వందల మంది ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు నిరనసన తెలిపారు. దాదాపు 357 మంది ఓటర్లు ఓటు వేయకుండా బహిష్కరించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ కూటమి నేతలు రూ.కోట్లల్లో నగదు ఖర్చుచేశారు. మద్యాన్ని ఏరులై పారించారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.500 వరకు ఇవ్వగా, వైఎస్సార్‌సీపీ నుంచి గట్టి పోటీ ఉన్న చోట రూ.1,000కు పైనే పంచినట్టు సమాచారం. పురుషులకు మద్యం బాటిళ్లు, బిర్యాన్ని ప్యాకెట్లు అదనం. బుధవారం మొదలైన పంపకాలు గురువారం సాయంత్రం వరకు సాగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. కూటమి ఎమ్మెల్యేలతో పాటు నాయకులు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ పోలింగ్ కేంద్రాల పరిధిలోనే ప్రచారాలు సాగిస్తూ హల్‌చల్ చేశారు.
పోరు ముగిసింది.. ఫలితం మిగిలింది
జిల్లాలో ముగిసిన పరిషత్ పోలింగ్
69.73 శాతం ఓటింగ్ నమోదు
కూటమి నేతల బరితెగింపు
రేపు భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో కౌంటింగ్
కోమటితిప్పలో ఎన్నికల బహిష్కరణ
జెడ్పీటీసీ స్థానాలు 20
పోటీలో అభ్యర్థులు 67
ఎంపీటీసీ స్థానాలు 340
పోటీలో అభ్యర్థులు 744
పోలింగ్ కేంద్రాలు 1,244
ఉ. 9 గంటలు 12.71
ఉ. 11 గంటలు 30.52
మ. 1 గంట 48.03
మ. 3 గంటలు 59.16
సా. 5 గంటలు 67.36
పోలింగ్ ముగిసే సరికి 69.73
పోలింగ్ అనంతరం భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో గల బ్యాలెట్ బాక్సులను భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల, నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని బాక్సులను నరసాపురంలోని వైఎన్ కళాశాల, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లోని బాక్సులను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. శనివారం ఆయా కేంద్రాల వద్దనే కౌంటింగ్ నిర్వహించనున్నారు. పోటీలో నిలిచిన 67 మంది జెడ్పీటీసీ, 744 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం తేలనుంది.


