గోస్తనీ నీటిమట్టంపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

గోస్తనీ నీటిమట్టంపై అప్రమత్తం

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

గోస్తనీ నీటిమట్టంపై అప్రమత్తం ఎన్నికలు ప్రశాంతం కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఎన్నికల విధులు ముగించుకుని వస్తూ మృత్యువాత

తణుకు అర్బన్‌: తణుకులో గోస్తనీ కాలువ నీటిమట్టం పెరిగి రహదారులపైకి వస్తున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. పట్టణ పరిధిలో ముంపు ప్రాంతాలను గురువారం ఆమె పరిశీలించారు. ఆంధ్రా సుగర్స్‌ ఎదురుగా కాలువ ఉధృతంగా ఉండడంతోపాటు రోడ్డుపైకి నీరు వస్తుండటంతో ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌, తహసీల్దార్‌ దండు అశోక్‌వర్మ ఉన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: మండలంలో పరిషత్‌ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల వ్యయ పరిశీలకుడు మహమ్మద్‌ అబ్ధుల్‌ రాహుప్‌ షేక్‌ అన్నారు. పెదతాడేపల్లి, వెంకట్రామన్నగూడెంలో పోలింగ్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి ఓటింగ్‌ తీరును పరిశీలించారు. అలాగే వెబ్‌ కాస్టింగ్‌ విధానాన్ని పరిశీలించారు. రిటర్నింగ్‌ అఽధికారి ఏవీ సూరిబాబు, ఎంపీడీఓ వి.చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

కౌంటింగ్‌కు 22 టేబుళ్లు

నన్నయ్య వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని వ్యయ పరిశీలకుడు పరిశీలించారు. తాడేపల్లిగూడెం డివిజన్‌ పరిధిలో ఓట్లను శనివారం లెక్కిస్తామని, ఈ మేరకు 22 టేబుల్స్‌ ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు సహాయక సిబ్బంది ఉంటారన్నారు. 11 టేబుల్స్‌ ఎంపీటీసీ, 11 టేబుల్స్‌ జెడ్పీటీసీల కౌటింగ్‌ ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

భీమవరం: భీమవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, భీమవరం డివిజన్‌కు సంబంధించిన రిసెప్షన్‌ కేంద్రాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ, పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సుల భద్రత, స్ట్రాంగ్‌ రూమ్‌లలో చేపట్టిన ఏర్పాట్లు, కౌంటింగ్‌ హాళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాలకొల్లు సెంట్రల్‌: ఎ న్నికల పోలింగ్‌ విధులు ముగించుకుని వస్తుండగా హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గెద్దాడ నమఃశివాయ (శివ) (61) హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గురువా రం మండలంలోని చందపర్రు గ్రామంలో పో లింగ్‌ బూత్‌లో విధులు నిర్వహించారు. సా యంత్రం ఓటింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అప్పగించారు. కార్యాలయం నుంచి బయటకు వస్తూ స్పృహ తప్పి పడిపోగా సహచర ఉద్యో గులు పోలీస్‌ వాహనంలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివ స్వ గ్రామం యలమంచిలి మండలంలో కాంబొట్లపాలెం. ఆయనకు భార్య, కుమారుడు, కుమా ర్తె ఉన్నారు. ఈనెల 21న కుమార్తె వివాహం పెట్టుకున్నారని, ఇంతలోనే ఇలా జరిగిందని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ సీ ఐ కోలా రజనీకుమార్‌, ఎస్సై పృధ్వీ, పోలీసు సిబ్బంది సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement