పోలింగ్‌ కేంద్రంలో కూటమి నేతల బ్యానర్‌ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రంలో కూటమి నేతల బ్యానర్‌

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

పోలింగ్‌ కేంద్రంలో కూటమి నేతల బ్యానర్‌

ఉండి: ఎన్నికల నిబంధనలను కూటమి నాయకులే కాదు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణగా ఉండిలో పోలింగ్‌ బూత్‌ 40లో జరిగిన ఘటనే నిదర్శనం. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఈ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ పోషకాహారంపై అవగాహన కల్పిచేందుకు ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్‌, రాజ్యసభ ఎంపీల ఫొటోలతో ఉన్న బ్యానర్‌ ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ బ్యానర్‌ను తొలగించలేదు. ఈ పోలింగ్‌ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కల్పశ్రీ తనిఖీ చేసినా ఆమె కూడా బ్యానర్‌ను పరిశీలించలేదు. దీనికి తోడు అదే బ్యానర్‌పై అధికారులు పోలింగ్‌ ఆఫీసర్‌ అనే స్టిక్కర్‌ను కూడా అంటించడం గమనార్హం. దీనిపై ఓటర్లలో తీవ్ర చర్చ జరగడంతో విషయం తెలిసిన అధికారులు అప్పటికప్పుడు బ్యానర్‌ను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement