చినవెంకన్నకు స్వర్ణ, రజత కానుకల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

చినవెంకన్నకు స్వర్ణ, రజత కానుకల సమర్పణ

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు గుంటూరుకు చెందిన భక్తురాలు వెలగలేటి సత్యవతి మంగళవారం సుమారు రూ. 11.63 లక్షలు విలువైన బంగారు, వెండి కానుకలను సమర్పించారు. దివంగత వెలగలేటి దుర్గాదేవి జ్ఞాపకార్థం దాత కుటుంబసభ్యులు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావుకు ఈ కానుకలను అందజేశారు. లక్ష్మీదేవి రూపులు, ముత్యాలు, ఎరుపు, తెలుపు, పచ్చ రాళ్లతో డిజైన్‌ చేసిన సుమారు రూ.10.85 లక్షలు విలువైన 72 గ్రాముల బరువు గల రెండు పేటల బంగారు లక్ష్మీదేవి మెట్ల హారంతో పాటు, అష్టలక్ష్ముల రూపాలతో సుమారు రూ. 78 వేలు వెచ్చించి తయారు చేయించిన 340 గ్రాముల బరువు గల నగిషీ వెండి చెంబును స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని ఈఓ ప్రత్యేకంగా అభినందించి, సంబంధిత రసీదును అందజేశారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదాలను అందించారు.

72 గ్రాముల బంగారు హారం, 340 గ్రాముల వెండి చెంబు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement