కుక్కునూరులో టీడీపీకి ఎదురుదెబ్బ | - | Sakshi
Sakshi News home page

కుక్కునూరులో టీడీపీకి ఎదురుదెబ్బ

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

కుక్కునూరులో టీడీపీకి ఎదురుదెబ్బ

సీనియర్‌ నేత లంకల రాజేశ్వరరావు

వైఎస్సార్‌సీపీలో చేరిక

కుక్కునూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కుక్కునూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ నాయకుడిగా, గ్రామ కన్వీనర్‌గా కొనసాగుతున్న సీనియర్‌ నాయకుడు లంకల రాజేశ్వరరావు(రాజు) మంగళవారం ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న సమయంలో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన నాయకుడు పార్టీని వీడటం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కుచ్చర్లపాటి కృష్ణంరాజు, కుక్కునూరు ఎంపీటీసీ అభ్యర్థి రావు వినోద్‌ తదితరులు లంకల రాజేశ్వరరావుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ఆయన సేవలు ఉపయోగపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement