భీమవరం: భీమవరం పట్టణంలో జాతీయస్థాయి టెన్నిస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేష్ చంద్ర మహా పాత్ర అన్నారు. సోమవారం పట్టణంలోని కాస్మోపాలిటెన్ క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీల్లో పురుషుల విభాగంలో ప్రజన్ ఆదురై, సునీల్ మాలిక్, గురునాథ్ దామే, వి.ధీరజ్‌రెడ్డి విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో ప్రశాంతి అరుణ్ ముంధే, సీహెచ్.రేష్మ, బి.హృదేషి, ఎస్.చెవికారెడ్డి, డి.ఓమ్నా యాదవ్, కె.లలితా భాస్కర్‌రెడ్డి, ఎస్.ఆకృతి నారాయణ్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్.రామభద్రరాజు, బీహెచ్.సుబ్బరాజు, టోర్నమెంట్ చైర్మన్ యు.కృష్ణప్రసాద్, వైస్ చైర్మన్ టి.కృష్ణబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యు.వర్మ, ఉపాధ్యక్షులు వి.రమేష్, ఎ.బి.బేగ్, ఆర్.సుబ్బరాజు, పి.కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం) : గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. 52 రోజులకు గాను రూ.31,40,038, అన్నదానం హుండీ ద్వారా రూ.90,022 మొత్తం రూ. 32,30,060 ఆదాయం సమకూరిందన్నారు. వీటితో పాటు 249.085 గ్రాముల బంగారు కానుకలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాసు పర్యవేక్షించారు.
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలో లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. గాయపడిన ముగ్గురు ప్రయాణికులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పెంటపాడు: మండలంలోని పలు గ్రామాల్లో సామాన్లు, చిన్నపాటి వస్తువులు వంటి చిల్లర దొంగతనాలు చేసిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నాగమణి, కల్యాణ్, మహేష్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇరగవరం : కంతేరు గ్రామానికి చెందిన రంకిరెడ్డి తాతారావు (80) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గతనెల 29వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన, ఇప్పటివరకు తిరిగి రాలేదు. దీనిపై ఆయన కుమారుడు రంకిరెడ్డి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరగవరం ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కై కలూరు: వరుస దొంగతనాలతో కై కలూరు నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముదినేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీ ఘటన మరవకముందే.. కై కలూరు ఎన్జీవోస్ కాలనీలో ఓ ఇంటిని దొంగలు సోమవారం దోచేశారు. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోని ప్రకాశ్‌రావు ఇంట్లో కేశవరపు సత్యనారాయణమూర్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వారు ఆదివారం ఉదయం ఊరికి వెళ్లారు. సోమవారం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో సత్యనారాయణమూర్తి వచ్చి పరిశీలించగా.. రూ.63 వేలు విలువైన బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై కే.గణేష్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


