బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు విషయంలో పునరాలోచించాలి | - | Sakshi
Sakshi News home page

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు విషయంలో పునరాలోచించాలి

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

చింతలపూడి: బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు డిమాండ్‌ చేశారు. చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి పార్టీ నాయకులు శెట్టిపల్లి మోహన్‌బాబు, సయ్యద్‌ బాజీ ఆధ్వర్యంలో.. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి భూక్యా రవికుమార్‌తో కలిసి విజయరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే యూసీజీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుంటే, కూటమి ప్రభుత్వం వాటిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.వెయ్యి ఉన్న 25 కేజీల బియ్యం బస్తా.. కూటమి హయాంలో రూ.2,350కి చేరిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క కొత్త పెన్షన్‌ ఇవ్వలేదని, కనీసం కొత్త ఇల్లు కూడా కూటమి ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆక్షేపించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జెడ్పీటీసీ అభ్యర్థి భూక్యా రవికుమార్‌తో పాటు మండలంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొలుగుమటి నీరజ సుధాకర్‌, మాజీ ఎంపీపీ డాక్టర్‌ రాంబాబు నాయక్‌, జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏ.సుబ్బారావు, చింతలపూడి పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ యర్రంశెట్టి రామకృష్ణారావు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కే.చండీప్రియ, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి విజయరాజు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement