కొయ్యలగూడెం: యర్రంపేట పంచాయతీ తిమ్మనకుంట గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీపీ గంజిమాల రామారావు వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గురుముచ్చు అంజి, మల్లాది యేసయ్య, గురుముచ్చు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు తమ అనుచరులతో కలిసి చేరారు. వీరు వైఎస్సార్సీపీలో చేరడం తన విజయానికి మరింత దోహదపడుతుందని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి (యర్రంపేట–2) చొక్కా లీలావతి పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షుడు సవల నాగేశ్వరరావు, శూలం అగ్గిరాజు, మరిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జనసేనను వీడి వైఎస్సార్ సీపీలో చేరిక
పెనుమంట్ర: సోమరాజు ఇల్లిందలపర్రు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గూడూరి నాగార్జున ఆ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆశీస్సులతో మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ వైఎస్సార్ సీపీలో చేరినట్లు ఆయన ప్రకటించారు.


