విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి సక్రమంగా తాగునీటి సరఫరా జోరు వానలోనూ అట్లతద్ది పూజలు

భీమవరం(ప్రకాశంచౌక్‌): తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్‌ శాఖ కార్యాలయంలో విద్యుత్‌ ఎస్‌ఈ పి.ఉషారాణితో సమీక్షించారు. తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్‌ తీగలు తెగిపడటం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులను వేగిరపర్చాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తాగునీటి సరఫరా కేంద్రాలు వంటి అత్యవసర సేవలకు తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యుత్‌ తీగలు తెగిపడిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్‌ సమస్యల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించేలా కంట్రోల్‌రూమ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల పురోగతిని ఎస్‌ఈ ఉషారాణి వివరించారు. విద్యుత్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌): తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా విద్యుత్‌ శాఖ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్‌ సీఈఓ, డీపీఓ, ఆర్డీఓలు తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆయా గ్రామ పంచాయతీల్లో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి టీఆర్‌–27 నిధులు వి డుదల చేసి, వాటి ద్వారా డీజిల్‌ జనరేటర్లను అద్దెకు తీసుకోవడంతో పాటు అవసరమైన డీజిల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. కనీసం రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు సరిపడా డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉంచుకుని, ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించాలని స్పష్టం చేశారు. గ్రామా ల్లో పడిపోయిన చెట్లను తొలగించడం, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం వంటి పనులను చేపట్టాలన్నారు. డీపీఓ, జెడ్పీ సీఈఓ, అధికారులు తాగునీటి సరఫరా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయ పండుగ అట్లతద్ది. బుధవారం హోరు వానలోనూ అట్లతద్ది సాంప్రదాయాన్ని మండలంలోని మహిళలు కొనసాగించారు. మాధవరం, అప్పారావుపేట, మోదుగగుంట గ్రామాల్లోని చెరువులు, కాలువల వద్ద కు మహిళలు జోరు వానలోనూ గౌరమ్మకు పూ జలు నిర్వహించి ఇంటికి చేరుకుని ముత్తయిదువులకు వాయినాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement