పెన్నాడ –1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరుపున నామినేషన్ దాఖలు చేశాను. గత మూడు రోజులుగా చాలా మంది నన్ను నామినేషన్ విత్డ్రా చేసుకొమ్మని వేధిస్తున్నారు. అయినా సరే లెక్కచేయకుండా నేను పోటీలో ఉన్నాను. నిన్న రాత్రి రాత్రి నుంచి నా వెనుక ఉన్న పెద్దలపైనా చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను. కూటమి నాయకులు చేస్తున్న కుట్రలు నాకు సబబు అనిపించడం లేదు. నా ఆవేదనను అర్ధం చేసుకుని గ్రామ ప్రజలను నన్ను క్షమించమని వేడుకుంటున్నాను.
– పాండ్రంకి శ్రీనివాసరావు,
పెన్నాడు, పాలకోడేరు మండలం


