తీరంలో అల్లకల్లోలం | - | Sakshi
Sakshi News home page

తీరంలో అల్లకల్లోలం

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

నరసాపురం రూరల్‌: అర్నబ్‌ తుపాను తీవ్రమవుతుండటంతో జిల్లాలోని తీరప్రాంత మండలాలు అప్రమత్తమయ్యాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల పరిధిలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 24 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆర్‌డీఓ దాసిరాజు తెలిపారు. మంగళవారం ఆయన తీర ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉచిత ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచామని వివరించారు. మరోవైపు, మంగళవారం సాయంత్రం నుంచి గాలుల వేగం పెరగడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పేరుపాలెం, పెదమైనివానిలంక, చినమైనవానిలంక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. పడవలు, వలలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement