స్థానిక సమరం.. బెదిరింపుల పర్వం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరం.. బెదిరింపుల పర్వం

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

తలొగ్గని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

న్యూస్‌రీల్‌

వైభవంగా శ్రీవారి చక్రస్నానం
ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆశ్వీయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం శ్రీచక్ర స్నాన వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. 8లో u

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓటమి భయం పట్టుకుంది. పోటీ ఉంటే ఓటమి తప్పదని ఏకగ్రీవాల కోసం ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విష సంస్కృతికి బీజం వేసింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ విపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై సామధాన దండోపాయాలను ప్రయోగించింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వెనక్కి తగ్గగా అధికశాతం మంది అధికార కూటమి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గకుండా ఎదురొడ్డి పోటీలో నిలిచారు. జిల్లాలోని నరసాపురం మున్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీతో పాటు 20 జెడ్పీటీసీ, 371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ అమల్లో ఉంది. పురపోరుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యి పోటీలోని అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. జెడ్పీటీసీ స్థానాల కోసం వచ్చిన మొత్తం 138 నామినేషన్లలో వైఎస్సార్‌సీపీ నుంచి 46, కూటమి నుంచి 85, స్వతంత్రులు ఆరుగురు ఉన్నారు. ఎంపీటీసీ స్థానాల కోసం 1,785 నామినేషన్లు దాఖలు కాగా వైఎస్సార్‌సీపీ నుంచి 724, కూటమి పక్షాల నుంచి 952 ఉన్నాయి.

20 జెడ్పీటీసీ స్థానాలకు 67 మంది అభ్యర్థులు

జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 67 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జిల్లాలోని 20 మండలాల జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులు బరిలో నిలవగా జనసేన తరఫున 6 మండలాలకు, టీడీపీ తరఫున 13 మండలాలకు, కాంగ్రెస్‌ తరఫున 14 మండలాలకు, సీపీఎం 3, బీజేపీ 1, బీఎస్పీ 2 మండలాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు.

కేసులు పెట్టిస్తామంటూ, ఇళ్లు కూలగొట్టిస్తామంటూ, వ్యాపారాలు జరగనివ్వమంటూ కూటమికి చెందిన వారు ఎన్ని రకాలుగా కుట్రలు, కుతంత్రాలు చేసినా, వేధింపులకు గురిచేసినా అధికశాతం మంది అభ్యర్థులు తలొగ్గకుండా పోటీలో నిలిచారు. జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాల్లోను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. 371 ఎంపీటీసీ స్థానాలకు గాను 340 స్థానాల్లో పోటీలో ఉన్నారు. కూటమి కుట్రరాజకీయాలకు ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో ముందుకు దూసుకువెళుతున్నారు.

కూటమిలో ఓటమి గుబులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల విత్‌ డ్రాకు ఒత్తిళ్లు

ముందుగా బెదిరింపులు.. తలోగ్గకుంటే బేరసారాలు

గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదంటున్న అభ్యర్థులు

బెదిరింపులకు లొంగని

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement