నరసాపురం: అర్నబ్ తుపాను తాకిడికి నష్టపోయిన బాధితులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచారు. తుపాను కారణంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసాపురంలోని 1వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి సోమరాజు దుర్గాభవానీతో కలిసి చైర్పర్సన్ అభ్యర్థి కావలి రామసీత పర్యటించి ప్రజలను పరామర్శించి ఇంటిపై చెట్టుపడి ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచారు. అలాగే 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల వెంకటరమణ తుపాను బాధితులకు కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.


