బైక్‌లపైకి దూసుకెళ్లిన కారు
పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో రెండు బైక్‌లపైకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. 8లో u
భీమవరం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు వీరికి మద్దతు ప్రకటించి మాట్లాడుతూ 16 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వీఆర్‌ఏల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశానికి హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జకరయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ పి.గోపాలకృష్ణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3న అండర్ 14, 17 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నెట్‌బాల్ సెలెక్షన్స్ పాలకోడేరు మండలం గొరగనమూడి హైస్కూల్‌లో, ఫెన్సింగ్ సెలెక్షన్స్ వీరవాసరం హైస్కూల్‌లో నిర్వహించనున్నట్టు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు జి.నర్మద, మహమ్మద్ కుద్దూస్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంలో హాజరుకావానలి, మరిన్ని వివరాలకు సెల్ 9885158366లో సంప్రదించాలని కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో జిల్లాకు చెందిన విద్యార్థిని మూడో స్థానంలో నిలిచింది. 27 జిల్లాల నుంచి 54 మంది విద్యార్థులు హాజరుకాగా మహా త్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని బి.ఆశా ప్రతిభ కనబర్చింది. ఆమెను, గైడ్ టీచర్‌ను డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ, జిల్లా సైన్స్ అధికారి ఎస్‌వీఎస్ సోమయాజులు అభినందించారు.


