లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం

భీమవరం (ప్రకాశంచౌక్‌): పట్టణంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి గురువారం పర్యటించి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చినరంగనిపాలెం రజకపేట, రైల్వేస్టేషన్‌ రోడ్డు, డీఎన్నార్‌ కళాశాల రోడ్డు, మెంటేవారితోటలో మిరిమియాకోడు లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి, కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. శానిటేషన్‌, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారుల సమన్వయంతో పనులు చేయాలన్నారు. అనంతరం నరసయ్య అగ్రహారంలో సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారం, విద్యా సౌకర్యాలు, వసతిపై ఆరా తీశారు. అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌ తాతాబాబు, ఎంహెచ్‌ఓ డా.రాజేష్‌, ఏఈలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement