ఎటుచూసినా..ఎడతెగని వాన | - | Sakshi
Sakshi News home page

ఎటుచూసినా..ఎడతెగని వాన

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

డీజిల్‌కు బదులు నీళ్లు ఎటుచూసినా..ఎడతెగని వాన దేవుడి భూమికి రక్షణ ! IIలో u

న్యూస్‌రీల్‌

డీజిల్‌కు బదులు నీళ్లు
ఉండి మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ఓ పెట్రోల్‌ బంకులో వాహనాల్లో డీజిల్‌కు బదులు నీళ్లు నింపడం వివాదానికి కారణమైంది. IIలో u

లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయానికి చెందిన వివాదాస్పద భూమిలో అధికారులు రెండు హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు.

శురకవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: తీవ్రవాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు దంచికొడుతున్నాయి. గురువారం జిల్లా సగటు వర్షపాతం 8.5 సెం.మీగా నమోదైంది. కుండపోతతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట కాలువలు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పొలాలు నీటమునిగి వరి రైతులు, చలిగాలులతో చెరువుల్లో ఆక్సిజన్‌ లెవిల్స్‌ పడిపోయి ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నారు.

170.8 సెం.మీ వర్షం

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లా మొత్తంగా 170.8 సెం.మీ వర్షం పడగా జిల్లా సగటు 8.5 సెం.మీగా ఉంది. అత్యధికంగా తణుకులో 11.6 సెం.మీ వర్షం కురవగా తాడేపల్లిగూడెంలో 10.5, పోడూరులో 10.4 సెం.మీ వర్షం కురిసింది. ఉండి, పాలకోడేరు, పెనుగొండ, పెనుమంట్ర, ఇరగవరం 9 సెం.మీ లకు పైగా, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, గణపవరం, ఆచంట, పెంటపాడు, మొగల్తూరులో 8 సెం.మీ. పైగా వర్షం పడింది. అత్యల్పంగా అత్తిలిలో 3.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల సమయానికి జిల్లా అంతటా 22.7 సెం.మీ వర్షం కురిసింది.

మార్కెట్లు వెలవెల : లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై గోతులు వర్షం నీటితో నిండిపోయి కనిపించక పలుచోట్ల ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలు పాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి రూరల్‌ ఏరియాలతో పాటు పట్టణాల్లోని పలు ప్రాంతాల్లోను విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని ప్రధానమైన బొండాడ, గునుపూడి సౌత్‌, యనమదుర్రు, గొంతేరు, భగ్గేశ్వరం, మొగల్తూరు కాజా, రుద్రయ్య కోడు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి.

పట్టణాల్లో స్తంభించిన జనజీవనం

భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు బస్టాండులలో వర్షంనీరు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భీమవరంలోని ఇందిరమ్మ నగర్‌, హౌసింగ్‌బోర్డు, మెంటేవారితోట, గునుపూడి, ఫైర్‌స్టేషన్‌, బ్యాంక్‌ కాలనీలోని పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లలోని చెత్త రోడ్లపైకి చేరి స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పాలకొల్లు హౌసింగ్‌బోర్డు కాలనీ, బస్టాండ్‌ సెంటర్‌, సలాదివారితోట, పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో శివారు ప్రాంత కాలనీల్లో వర్షంతో ఇబ్బందులు పడ్డారు. డ్రెయినేజీ వ్యవస్థలు లేక పోవడంతో రోడ్లుపైనే వర్షం నీరు నిలిచిపోయింది. మురుగుతో కలిసి వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో దుర్వాసనతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. తణుకులో రైల్వే స్టేషన్‌ రోడ్డు, మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్లు, ఆకివీడులో సంతపేట, శాలిపేట, జవహర్‌ నగర్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డుతోపాటు పలు గ్రామాల్లోని రహదారులు నీట మునిగాయి.

ఆందోళనలో రైతులు

జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుచేయగా, దాదాపు లక్ష ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రస్తుతం వరి పంట అధిక శాతం విస్తీర్ణంలో ఈనిక, గింజ గట్టిపడే దశల్లో ఉంది. ఈ తరుణంలో అధిక వర్షాలతో పొలాలు నీట మునుగుతుండటం రైతులను కలవరపరుస్తోంది. మరోపక్క చలిగాలుల తీవ్రతకు చెరువుల్లో ఆక్సిజన్‌ లెవిల్స్‌ పడిపోతుండటం ఆక్వా రైతులను కలవరపరుస్తోంది. ఆక్సిజన్‌ లెవిల్స్‌ పెంచుకునేందుకు ఏరియేటర్లు తిప్పడం, అవసరమైన మందుల వినియోగానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు. అత్యవసర సేవల నిమిత్తం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు.

కుంభవృష్టి

తీవ్ర వాయుగుండంతో భారీ వర్షం

జిల్లాలో 170.8 సెం.మీ వర్షం

స్తంభించిన జనజీవనం

లోతట్టు ప్రాంతాలు జలమయం

ఈదురుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నీట మునుగుతున్న పంట పొలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement