జిల్లాలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. గజానికో గొయ్యి.. అడుగుకో గుంత అన్నట్టు ఉన్నాయి. సాధారణ రోజుల్లో సర్కాస్ ఫీట్లను తలపించేలా రాకపోకలు సాగిస్తున్న గ్రామీణులు.. వర్షం కురిస్తే మరింత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. చిన్నపాటి వర్షానికీ భారీ గోతుల్లో నీరు నిలిచి పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాళ్ల మండలంలోని ఏలూరుపాడు నుంచి ఆకివీడు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిలో ముఖ్యంగా ఏలూరుపాడు నుంచి చెరుకుమిల్లి వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి భారీ భారీ గోతులతో మరింత దారుణంగా ఉంది. రాత్రిళ్లు ప్రయాణం ప్రమాదకరంగా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు. – కాళ్ల


