కూటమి మెడలు వంచుదాం | - | Sakshi
Sakshi News home page

కూటమి మెడలు వంచుదాం

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

కూటమి మెడలు వంచుదాం

ప్రజల జీవనం అస్తవ్యస్తం

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ మెడలు వంచాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గమిని ఫంక్షన్‌ ప్లాజాతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ కూటమి పాలనపై ప్రజలు విసుగు చెందారని, గత వైఎస్సార్‌సీపీ పాలనను నేటి వెన్నుపోటు పార్టీ పాలనకు బేరీజు వేసుకుంటున్నారన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ నిర్మాణం, బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నాహం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నవారిని సుమారు 6 వేల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారన్నారు. కూటమి పాలన తీరుపై అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పింఛన్లు సుమా రు లక్ష తగ్గించిన ఘనత వెన్నుపోటు పార్టీకే దక్కుతుందన్నారు. నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం నాయకత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని, స్థానిక పోరులో కూటమి పార్టీకి మొట్టికాయలు కొట్టాలన్నారు.

గూడెంలో ఒకటే గ్రూపు

తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీలో రెండు గ్రూపులు లేవని, వైఎస్‌ జగన్‌ తన ప్రతినిధిగా నిలబెట్టిన వడ్డి రఘురాం ఒక్కరే ఇక్కడ నాయకుడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నా రు. రఘురాం నాయకత్వంలో అందరూ పనిచేయాలని, రఘురాం పనితీరుపై జగన్‌ సంతోషంగా ఉ న్నారన్నారు. వడ్డి నాయకత్వంలో గూడెంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందన్నారు.

ఓటర్లను చైతన్య పరిచేలా..

ఓటర్లను చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేస్తుండాలని నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకురాలు గూడూరి ఉమాబాల అన్నారు. ఆక్వా రైతులకు పార్టీ అండగా నిలిచిందని, దగా డీఎస్పీ లోపాలను ఎత్తి చూపి చైతన్యం తీసుకొచ్చిన క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీదే అన్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా సమైక్యంగా ముందుకు సాగాలని బీఎల్‌ఏలకు ప్రభుత్వం ఏర్పడ్డాక తగిన గుర్తింపు ఇవ్వాలని నా యకులు కోరారు. పార్టీ గుర్తింపు కార్డులను నాయకులకు అందజేశారు. సీనియర్‌ నాయకులు గుండుమోగుల బలుసులరావు, గుండుబోగుల నాగు, పత్సా రామచంద్రయ్య, ఎంపీపీ శేషులత, గూడెం పట్టణ కమిటీ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాసు, మండల కమిటీ అధ్యక్షుడు చిట్టూరి బాపన్న, పెంటపాడు మండల అధ్యక్షుడు కై గాల శ్రీనివాసు, నాయకులు కిరణ్‌రెడ్డి, గణపతి, విజయరత్నం, వట్టి బుజ్జి, సంపతరావు కృష్ణారావు, వీర్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌

కూటమి పాలనలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ అ న్నారు. నిత్యావసరాల ధరలపై ప్రభుత్వ ని యంత్రణ లేదని, ఆస్పత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు లేకపోవడంతో పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల బాట పడుతున్నారన్నారు. తాను మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వానికి చీమకుట్టలేదు. ఆహార కల్తీ యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement