తణుకు అర్బన్: రైసుమిల్లులో ప్రమాదవశాత్తూ కా ర్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని వే ల్పూరులో చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరుకి చెందిన అవిడి దుర్గాప్రసాద్ (42) శ్రీ అన్నపూర్ణ రైసుమిల్లులో వినాయకచవితి పనుల్లో భాగంగా శుక్రవారం మిల్లును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశా త్తూ మృతిచెందారు. దుర్గాప్రసాద్ మిల్లు పైభాగంలో శుభ్రం చేస్తుండగా సిమెంట్ రేకు జారి కిందకు పడిపోవడంతో తలభాగంలో తీవ్రగాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే క్ర మంలో మార్గమధ్యంలో మృతిచెందారు. మృతదేహానికి తణుకు రూరల్ పోలీసులు పంచనామా జరిపిన అనంతరం తణు కు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. భార్య మీనాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబానికి ఆయనే ఆధారం
దుర్గాప్రసాద్‌కు భార్యతోపాటు లోకేష్, చరణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియెట్ చదువుతు న్న పిల్లలిద్దరూ దివ్యాంగులు కావడంతో వారిని కంటికి రెప్పగా కాపాడుకుంటూ దుర్గాప్రసాద్ కష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి ఆయనే ఆధారం కావడంతో భార్యాబిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దుర్గాప్రసాద్ మరణంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు వేల్పూరులో విషాదాన్ని నింపాయి. మిల్లులో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పనులు చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైస్‌మిల్లులో కార్మికుడి దుర్మరణం


