నరసాపురం: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు సాగేలా ఉత్సవ కమిటీలు జాగ్రతలు తీసుకోవా లని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్‌లోని గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మండపాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. డీఎస్పీ ఎం.సుధాకర్ మాట్లాడుతూ మండపాల వద్ద, నిమర్జనం సమయంలోనే డీజేలు నిషేధించినట్టు చెప్పారు. మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని, మంజూరు సులభతరం చేశామన్నారు. మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. డివిజన్‌లోని వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


