డీఎస్సీపై సీబీఐ విచారణకు లోకేష్‌ జంకు: వడ్డి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై సీబీఐ విచారణకు లోకేష్‌ జంకు: వడ్డి

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

డీఎస్సీపై సీబీఐ విచారణకు లోకేష్‌ జంకు: వడ్డి

దగా డీఎస్సీపై సీబీ ఐ విచారణ వేయమంటే మంత్రి లో కేష్‌ జంకుతున్నారని తాడేపల్లిగూడెం కన్వీనర్‌ వడ్డి రఘురాం ఎద్దేవా చేశారు. నా యకులు పార్టీలు మారుతుంటారు, కార్యకర్తలు నమ్ముకున్న జెండాను మోస్తుంటారన్నారు. సమన్వయకర్త అంటే కార్యకర్తలను అధినాయకుడికి అనుసంధానం చేసే వ్యక్తి అని, తాను నాయకుడిగా ఫీలవ్వనని, కార్యకర్తగా అనుకుంటానన్నారు. అందరిలో ఒకటిగా ఉంటా ఏ సమస్య ఉన్నా ప్రజాపక్షం వహిద్దామని కోరారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ అండగా ఉంటారన్నారు. ఆక్వా రైతులు నిత్యం జగన్‌మోహన్‌రెడ్డి పేరును తలచుకుంటున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కానివ్వబోమని, ఫలితం ఎలా ఉన్నా అన్నిచోట్లా పోటీ పడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement