భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మాతాశిశు మరణాల నివారణకు నిరంతర పర్యవేక్షణ, సమగ్ర విశ్లేషణ, ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ సీహెచ్‌వీ భారతలక్ష్మి తలెఇపారు. మాతాశిశు మరణాల నివారణ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఏడు శిశు మరణాల నమోదు కాగా సమీక్షించారు. వెంకటరామన్నగూడెం, పాలకోడేరు, మార్టేరు, రేలంగి, అత్తిలి, పోడూరు, పెనుమంట్ర తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చోటుచేసుకున్న శిశు మరణాలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో అందించిన వైద్య సహాయం, రిఫరల్ సేవలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.వి.ప్రసాద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.దేవ సుధాలక్ష్మి, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు డా.ప్రవీణ్, డా.మాధవి కళ్యాణి, డా.సాయి కిరణ్మయి, జిల్లా గణాంకాధికారి ఎంఎస్ ప్రసాద్, మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం అమలు చేయాలని, ఖాళీలు భర్తీ చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయమైంది. అధికారులు, ఉద్యోగులు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకులన్నీ మూతపడ్డాయి. పట్టణ, పరిసర గ్రామాలల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుమేరకు సమ్మె నిర్వహించారు. నిరసన తెలిపి, పట్టణంలో ర్యాలీ చేశా రు. ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి తోట సూర్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఖాళీలు భర్తీ చేయాలని, బ్యాంకర్స్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మా ట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమన్నారు.
నరసాపురం: విభిన్న ప్రతిభావంతుడి తల్లి ఆ ర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నరసాపురం రుస్తుంబాద పంచాయతీకి చెందిన ఓ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్ (సాక్షి కాదు) పోలిశెట్టి చంటి సబ్సిడీ లోన్ ఇప్పిస్తానని సొమ్ములు వ సూలు చేసిన ఘటనపై కేసు నమోదైంది. టౌన్ ఏఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చినమామిడిపల్లికి చెందిన కె.లక్ష్మీప్రసన్నకు లోన్ ఇప్పిస్తానని చంటి మాయమాటలు చె ప్పాడు. ఫేక్ శాంక్షన్ లెటర్ చూపించి నమ్మించాడు. ముందుగా రూ.3.50 లక్షలు ఇవ్వాలని చెప్పి వసూలు చేసి, తర్వాత లోన్ విషయం ఎ వరికీ చెప్పొద్దని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
భీమవరం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వ హించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలన్నారు. నవంబర్ 15న ప రీక్ష నిర్వహిస్తారని, వచ్చే నెల 12లోపు చెల్లించాలన్నారు. ద రఖాస్తులను వచ్చేనెల 14లోపు తమ కార్యాలయంలో అందించాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా మొదటి స్థానంలో, జిల్లా అధికారుల సేవలపై ప్రజల సంతృప్తిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి అమరావతి వేదికగా జరుగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు.


