న్యూస్‌రీల్
సచివాలయాల వద్ద పడిగాపులు
పాలన చేపట్టిన 27 నెలల్లో కొత్త పింఛన్ల ఊసెత్తని చంద్రబాబు సర్కారు స్థానిక ఎన్నికల వేళ సరికొత్త డ్రామాకు తెరలేపింది. పింఛన్ల ఎప్పుడిచ్చేది చెప్పకుండా దరఖాస్తుల స్వీకరణ పేరిట జిమ్మిక్కులు చేస్తోంది. ఆంక్షల కొర్రీలు, పరిమిత గడువుతో పేదలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. 50 ఏళ్లకే పింఛన్ హామీని అటకెక్కించింది. పలు సచివాలయాల్లో గురువారం ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో దరఖాస్తుదారుల అవస్థలు వెలుగుచూశాయి.
కూటమిలో స్థానిక పంచాయితీ
శురకవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: 2024 జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేవారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే మరిచారు. రెండేళ్ల పాలనలో కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వపోగా ఉన్న వాటికి కోత పెట్టడంతో లబ్ధిదారుల సంఖ్య 2,19,625కు తగ్గిపోయింది. 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జిల్లాలో 2.5 లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. తమకు పింఛన్లు వస్తాయన్న వీరి ఆశలపైనా నీళ్లు చల్లారు.
ఎన్నికల జిమ్మిక్కు : ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు చేటుచేస్తుందన్న ఆందోళన కూటమిలో ఉంది. దీంతో హడావుడిగా కొత్త పింఛన్లు కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారని, పింఛన్ ఏ నెలలో ఇచ్చేది చెప్పడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈలోపు స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే కోడ్‌ను సాకుగా చూపించి పింఛన్లు విషయాన్ని పక్కన పెట్టేసే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
ఆంక్షల కొర్రీలు
పింఛన్ దరఖాస్తులో ఇంటి పన్ను, విద్యుత్ బిల్లుల రశీదులు అడుగుతున్నారని అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇవి ఎక్కడి నుంచి వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అర్బన్ ఏరియాల్లో 1000 చ.అ పరిధిలో సొంత ఇల్లు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలను వర్తింపచేస్తే ఇప్పుడు 174 జీఓ పేరుతో 750 చ.అ తగ్గించడంపై మండిపడుతున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు తహసీల్దార్ కార్యాలయాల్లో సమయం పడుతుండటంతో గడువులోపు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే వారు రేషన్ కార్డులో భర్తల పేరు తొలగించుకోవాల్సిందని చెప్పటంతో ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమంటున్నారు. ఉరుకులు పరుగులపై తహసీల్దార్ కార్యాలయాల్లో డిజిటల్ సంతకాలు చేయిస్తున్నా పేర్లు డిలీట్ అవ్వక తమకు పింఛన్ వస్తుందో రాదోనన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. హౌస్ మ్యాపింగ్ అవ్వక దరఖాస్తుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాళహస్తి నుంచి లారీల్లో వచ్చిన పైపులు
గతంలో ఠంఛనుగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఏడాది పొడవునా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు సిబ్బంది వాటిని అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేవారు. భర్త చనిపోయిన వారికి స్పౌజ్ కోటాలో మరుసటి నెల నుంచే పింఛన్ సాయం అందించేవారు. రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. చివరిగా 2024 జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు ఆపేసింది.
జిల్లాలోని కాళ్ల, దొడ్డనపూడి, ఉండి, యలమంచిలి, మేడపాడు, నరసాపురం–2 తదితర సచివాలయాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో సర్వర్ సరిగా పనిచేయక పేదల అవస్థలు వెలుగుచూశాయి. పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ఈనెల 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువిచ్చింది. మధ్యలో 12న 2వ శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు వరుస సెలవులు రావడంతో మిగిలింది ఏడు రోజులే. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోగా సర్వర్ సమస్యతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. తిండీతిప్పలు లేక సచివాలయ గేట్లు, మెట్ల మీద పడిగాపులు పడుతున్నారు.
పెన్షన్.. టెన్షన్
ప్రసహనంగా కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ
అప్లికేషన్స్ అప్‌లోడ్‌కుఏడు రోజులే గడువు
పనిచేయని సర్వర్, నిబంధనల కొర్రీ
కొత్త పింఛన్ల పంపిణీ తేదీని ప్రకటించని ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి
స్థానిక ఎన్నికల జిమ్మక్కు
కోడ్ వస్తే కొత్త పింఛన్లు హుళక్కే?


