గోల్డ్‌లోన్ కుంభకోణం గుట్టురట్టు
న్యూస్‌రీల్
బెయిల్‌పై బయటకు వచ్చి..
బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ యువకుడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేసి రూ.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వంలోని ప్రభుత్వ మద్యం పాలసీని రద్దు చేసి ప్రైవేట్‌పరం చేసింది. రెండేళ్ల కాలపరిమితిపై జిల్లాలోని 175 మద్యం షాపులను 2024 అక్టోబరు 14న లాటరీ ద్వారా కేటాయించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన దుకాణాలతో కలిపి వాటి సంఖ్య 194కు చేరింది. మద్యం షాపుల లీజు గడువు వచ్చేనెల 2తో ముగియనుంది.
సిండికేట్‌కు ఫుల్ కిక్కు : సిండికేట్‌కు మేలు చేస్తూ అమ్మకాలపై వ్యాపారులకు 10 శాతం ఉన్న మార్జిన్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం 14 శాతం చేసింది. ఈ ఏడాది జనవరిలో మార్జిన్‌ను మొత్తాన్ని 15 శాతంకు పెంచింది. మరోపక్క డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యం బాటిళ్లపై ఎకై ్సజ్‌శాఖ వసూలు చేస్తున్న 15 శాతం ఏఆర్‌ఈటీని పూర్తిగా ఎత్తివేశారు.
రోజుకు రూ.5 కోట్ల అమ్మకాలు : జిల్లాలో రోజుకు సుమారు రూ.5 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యాన్ని ఏరులై పారించడం ద్వారా అ మ్మకాలు పెంచుకునేందుకు ప్రతి నెలా ఎకై ్సజ్ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లు విధిస్తోంది. రోజువారి సమీక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు టా ర్గెట్ కోసం నిబంధన అమలులో చూసీచూడనట్టు ఉండటం సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్స జ్ పాలసీకి విరుద్ధంగా ఎంఆర్‌పీ ధరకు మించి అ మ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు నిర్వహిస్తున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్లు పేరిట చాలాచోట్ల వేళాపాళా లేకుండా అమ్మకాలు సాగిపోతున్నాయి.
మందుబాబులకు చుక్కలు
తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటూ.. ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. రూ.99 చీఫ్ లిక్కర్ మినహా మిగిలిన బ్రాండ్లుపై రెండేళ్లలో బాటిల్ ఎంఆర్‌పీ ధరకు రూ.20లు అదనంగా పెంచారు. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పే ద, మధ్యతరగతి వర్గాల వారే. రూ.99 చీఫ్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120ల ఓఏబీ, రూ.130ల మంజీర, రూ. 150 క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సి ల్వర్ బ్రాండ్లు, అలాగే మధ్యతరగతి వర్గాల వారు రూ.190ల ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆప్టర్ డార్క్, రూ.190ల ఎంహెచ్ బ్రాందీ, రూ.230ల 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రతి బాటిల్‌పైనా రెండేళ్లలో ప్రభుత్వం రూ.20 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10లు అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో రూ.40లు వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడుతో బాటిల్ ధర రూ.30లు అదనంగా పెరిగింది.
జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్‌లోన్ కుంభకోణంలో దర్యాప్తు మరింత పుంజుకుంది. ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో u
రెన్యువల్‌కే మొగ్గు
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఇప్పటికే బాగానే ఆర్జించిన సిండికేట్ వర్గాలు గడువు ముగుస్తున్న తరుణంలో నష్టాల రాగం అందుకున్నారు. భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించామని, సేల్స్‌పై 20 శాతం మార్జిన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం కోత పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. లీజు గడువు పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పాతవారికే తిరిగి షాపులు కట్టబెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. షాపులన్నింటినీ తిరిగి రెన్యువల్ చేయనున్నట్టు టీడీపీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు స్పష్టంచేశారు.
ఖజానాకు చిల్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అ మ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చే రి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేది. కా గా కూటమి పాలనలో మద్యం ఆదాయం చాలా వ రకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్లిపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం సిండికేట్‌కు కూటమి సర్కారు చంద్రన్న కానుక షురూ అయ్యింది. మద్యం దుకాణాల రెండేళ్ల లీజు గడువు వచ్చేనెల 2తో ముగియనుంది. మళ్లీ పాతవారికే షాపులు కట్టబెట్టేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మద్యం టెండర్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులపై నీళ్లుచల్లుతూ షాపులన్నింటినీ రెన్యువల్ చేస్తామని స్పష్టం చేశారు.
సిండికేట్‌కు చంద్రన్న కానుక
మద్యం దుకాణాల రెన్యువల్‌కు పచ్చజెండా
వచ్చేనెల 2తో ముగియనున్న లీజు గడువు
మళ్లీ పాతవారికే షాపులని స్పష్టం
ఇప్పటికే రెండుసార్లు మార్జిన్ పెంచిన ప్రభుత్వం
బాటిల్‌పై అదనంగా వసూళ్లు
జిల్లాలో 194 మద్యం దుకాణాలు, 27 బార్లు


