భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, అన్ని శాఖల మధ్య సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాటిని సున్నిత ప్రాంతాలుగా గుర్తిస్తూ పటాల రూపకల్పన ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, నిబంధనల ప్రకారం బైండోవర్ చర్యలు చేపడతామని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్ అరికట్టాలి
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అరికట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై జి ల్లా ఎస్పీతో సమావేశం నిర్వహించారు. ‘డ్రగ్స్ వ ద్దు..స్కిల్స్ ముద్దు’ అనే పోస్టర్ ఆవిష్కరించారు.
రోడ్డు భద్రతే లక్ష్యం
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోషకాహార లోపాన్ని నివారించాలి
పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. 9వ జాతీయ పోషణ మా సం–సెప్టెంబర్ 2026 కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ని ర్వహించారు. వచ్చేనెల 8 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జేసీ కేఆర్ కల్పశ్రీ, అధికారులు పాల్గొన్నారు.


