తణుకు అర్బన్: ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయంలో భాగంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు అన్నారు. తణుకు లయన్స్ క్లబ్‌లో బుధవారం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సతీమణి లక్ష్మీకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో సుమారు 6 వేల కార్డులు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే అండగా ఉంటారని, అటువంటి కార్యకర్తకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తనూ గుర్తించే కార్యక్రమంలో భాగంగానే ఐడీ కార్డులను అందిస్తున్నారని అన్నారు. నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు ఐడీ కార్డులు అందిస్తున్నామని, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు నాగు మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డుతో కార్యకర్తలకు గౌరవం, భద్రత కల్పించిందని అన్నారు.
కక్షగట్టి అక్రమ అరెస్ట్‌లు
కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో కక్షగట్టి తన భర్త, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కుమారుడు సునీల్‌కుమార్‌లను అక్రమ అరెస్టు చేసి జైలులో ఉంచారని కారుమూరి సతీమణి లక్ష్మీకిరణ్, సునీల్‌కుమార్ సతీమణి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా తమ కుటుంబం తీవ్ర క్షోభ అనుభవిస్తోందన్నారు. అయినా తాము బెదరబోమని, పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ప్రేమాభిమానాలతో ధైర్యంగా ఉన్నామని చెప్పారు. కారు మూరి రాజకీయంలో ఉన్నప్పటి నుంచి కుటుంబం కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతోనే అధిక సమయం గడిపారని అన్నారు.
బలహీనవర్గం నుంచి బలమైన నాయకుడిగా..
బలహీనవర్గం నుంచి వచ్చి బలమైన నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసు లో ఇరికించారని పార్టీ నేతలు అన్నారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్ సెల్ రాష్ట్ర అధి కార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, జిల్లాపరిష త్ సభ్యులు ఎండీ హబీబుద్దీన్, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామ న్న, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, పెనుమత్స సుబ్బరాజు, చోడే గోపికృష్ణ, పెనుమత్స రామరాజు, పొట్ల సురేష్, సబ్బితి రాజేష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్‌కుమార్, కలిశెట్టి ప్రకాష్, కొత్తపల్లి చరణ్, ఉండవల్లి జానకి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు


