కారుమూరి సునీల్ సతీమణి కీర్తి
ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమలో బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని అణచివేసేందుకు చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పికొడుతూ.. పార్టీ కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ సతీమణి కీర్తి భరోసా ఇచ్చారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె మమేకమయ్యారు.
జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయకర్తలు కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్ ఆమెకు సంఘీభావం తెలుపుతూ ధైర్యం చెప్పారు. అనంతరం కీర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొంటామనీ, అక్రమ కేసులు, అరెస్ట్‌లు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశా రు. రాష్ట్రంలో రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారనీ, అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామానా పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేడు దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీలోని బీసీ నాయకులను రాజకీయంగా దెబ్బకొట్టాలనే కుటిలమైన ఆలోచనతో అక్రమ కేసులు పెడుతున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
బీసీ నేతలపై వేధింపులు
జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్‌కుమార్‌ను లేని కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్‌లు చేసి, జైలులో పెట్టారని.. బీసీ నేతలను టీడీపీ ప్రభుత్వం వే ధింపులకు గురిచేయటాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. కారుమూరి కుటుంబానికి అందరూ అండగా నిలవాలన్నా రు. కూటమి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న కారుమూరి నాగేశ్వరరావు కుటుంబంపై ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. రానున్న రోజుల్లో నాగేశ్వరరావు, సునీల్‌కుమార్ కడిగిన ముత్యంలా బయటకు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


