ఏపీఎన్‌జీఓ జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీఎన్‌జీఓ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

ఏపీఎన్‌జీఓ జిల్లా కార్యవర్గం ఎన్నిక అంతర్జాతీయ రకికెట్‌ పోటీలకు ఎంపిక 12న ఆర్చరీ సెలెక్షన్లు కత్తిపోటుకు యువకుడు బలి

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా ఏపీఎన్‌జీఓ కార్యవర్గ సమావేశం గురువారం యూవీ పాండురంగారావు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాథ్‌ ఎన్నికల పరిశీలకునిగా హాజరుకాగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా జి.వరప్రసాద్‌, సంయుక్త కార్యదర్శిగా జీవీవీ దుర్గాప్రసాద్‌ను కో ఆప్షన్‌ పద్ధతిలో ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి సుకుమార్‌, జిల్లా సహా అధ్యక్షుడు అల్లూరి శ్రీనివాసరాజు, పాపకాయల కృష్ణ, కె.సత్యనారాయణ, హరిప్రసాద్‌, బీవీ సోమేశ్వరరావు పాల్గొన్నారు.

యలమంచిలి: నేపాల్‌లో నైన్‌ ఏ సైడ్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (ఎన్‌ఏసీఏ), యూత్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి జరిగే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌– 2026 పోటీలకు పాలకొల్లుకు చెందిన ముగ్గురు యువకులు ఎంపికయ్యారు. సీనియర్స్‌ ఇండియా క్లబ్‌ జట్టు రతఫున షేక్‌ సమీరుద్దీన్‌ కెప్టెన్‌గా, జక్కంపూడి భానుశ్రీకృష్ణ, చౌదరి కార్తీక్‌ కుమార్‌లు బ్యాట్స్‌మెన్‌లుగా ఎంపికయ్యారు. ఈ మే రకు ఎన్‌ఏసీఏ అధ్యక్షుడు ఎస్‌.జయసూర్య నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు సమీరుద్దీన్‌ చె ప్పారు. పోటీల్లో భారత జట్టుతో పాటు నేపాల్‌, భూటాన్‌ జట్లు పాల్గొంటాయన్నారు.

భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జూనియర్‌ అండ్‌ సీనియర్‌ ఆర్చరీ జిల్లా సెలెక్షన్లు ఈనెల 12న భీమవరం వంశీకృష్ణ నగర్‌లోని వోల్గా ఆర్చరీ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ జయ రాజు, ఇ సాహిత్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు విజయనగరంలో జరిగే జూనియర్‌ రాష్ట్రస్థాయి పోటీలు, భీమవరంలో నిర్వహించే సీనియర్‌ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. సెలెక్షన్లకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌ కార్డు, పుట్టినతేదీ జిరాక్స్‌, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో శనివారం ఉదయం 9 గంటలకు అకాడమీ వద్ద హాజరు కావాలన్నారు. వివరాలకు 84998,72291, 98491 81993 సెల్‌ నంబర్లకు సంప్రదించాలన్నారు.

ద్వారకాతిరుమల: చాయ్‌ బిస్కెట్‌ ఫుడ్‌ జోన్‌లో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తోటి కార్మికుడు కత్తితో పొట్టలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన కోనెటి గంగాధరరావు (35) చికిత్స అనంతరం విశ్రాంతి పొందుతూ గురువా రం మధ్యాహ్నం మృతిచెందాడు. ద్వారకాతిరు మల మండలం లక్ష్మీనగర్‌లో ఈనెల 8న రాత్రి ఘ టన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గంగాధరరావు, ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఏలూరు శివశంకర్‌ లక్ష్మీనగర్‌లో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్‌ బిస్కెట్‌ ఫుడ్‌ జోన్‌లో పనిచేస్తున్నారు. వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో గత 15 రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగాధరరావును పొట్టలో పొడి చి పరారయ్యాడు. వెంటనే ఫుడ్‌ జోన్‌ యజమాని భలే విజ్ఞేశ్వరరావు గాయపడిన గంగాధరరావును నల్లజర్లలోని పీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స అందించి మూడు కుట్లు వేశారు. అనంతరం అతడిని ఫుడ్‌ జోన్‌లోని రెస్ట్‌ రూమ్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో గంగాధరరావు మృతి చెందాడు. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుణ్ణంపల్లి ఇన్‌చార్జి వీఆర్వో వల్లూరి వెంకట సత్యనారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement